హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి జైలు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి జైలు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

దేవరపల్లి: గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2021లో ఒకే రోజు నమోదైన రెండు వేర్వేరు హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ కొవ్వూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంధం వెంకటలక్ష్మి సరస్వతి సోమవారం తీర్పు వెలువరించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన నిందితుడు గేరా వీరవెంకట సత్యనారాయణ 2021 మే నెల 30న హుకుంపేటలో స్థల వివాదం కారణంగా నాయుడు వీరకృష్ణపై గునపంతో దాడి చేశాడు. అదేరోజు కొద్ది సేపటి తర్వాత తన కోడలి ఉద్యోగానికి సంబంధించిన పాత గొడవల కారణంగా హుకుంపేటలోనే మునిశెట్టి సాయిశ్రీకళ్యాణ్‌, మునిశెట్టి లక్ష్మి అనే తల్లి కొడుకులపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలపై గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో అప్పటి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం రెండు కేసులు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా శిక్ష విధించారు.

మరో కేసులో

ముగ్గురి అరెస్ట్‌

అనపర్తి: బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో గత శుక్రవారం కొర్ల పద్మ (56)పై బంగారం కోసం హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పరారైన వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పట్టుబడగా వారిని మంగళవారం కోర్టు ముందు హాజరపరచనున్నట్టు ఎస్సై వి.రవిచంద్రకుమార్‌ తెలిపారు.

పీఆర్సీ నివేదిక ఇప్పించండి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక మోరంపూడిలోని సిటీ మున్సిపల్‌ హైస్కూల్‌లో జిల్లా ఏపీటీఎఫ్‌ (1938) సమావేశం సోమవారం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు కె.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ అధ్యక్షత వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు వి.అప్పయ్యశాస్త్రి మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ నివేదిక ఇప్పించాలని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ఉదయబ్రహ్మం, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement