11 నుంచి దసరా సంగీత, నృత్య నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

11 నుంచి దసరా సంగీత, నృత్య నాటకోత్సవాలు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

బోట్‌క్లబ్‌: స్థానిక సూర్యకళా మందిరంలో ఈ నెల 11 నుంచి 14 వరకూ దసరా సంగీత, నృత్య నాటకోత్సవాలు జరుగుతాయని సరస్వతీ గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తెలిపారు. సూర్యకళా మందిరంలో సోమవారం దసరా సంగీత ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 11న సాయత్రం 6.30 గంటలకు కొచ్చికి చెందిన శంకర్‌ నంబూద్రి గాత్ర కచేరి, 12న సాయంత్రం కర్ణాటకాకు చెందిన పండిట్‌ కై వల్య కుమార్‌ గౌరవ్‌ గాత్ర కచేరి, 13న సాయంత్రం నెల్లూరుకు చెందిన కంచి ఆస్థాన విద్వాంసులు జేవీ సురేష్‌, పి.వాసు శాక్సోఫోన్‌ కచేరి జరుగుతుందన్నారు. 14న సాయంత్రం భాగవతుల వెంకట రామశర్మ బృందం రామయణం కూచిపూడి నృత్య రూపకం ఉంటుందన్నారు. సంగీత ప్రియులు పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సరస్వతీ గానసభ అధ్యక్షులు ముళ్లపూడి నాగేశ్వరరావు, సెక్రటరీ పేపకాయల రామకృష్ణ, జీవితకాలపు అధ్యక్షుడు కొమ్మరెడ్డి శ్రీరామ నరసింగరావు, కార్యవర్గ సభ్యులు ఎల్‌.సత్యన్నారాయణన్‌, సీతాపతిరావు, వెత్సా ఆనంద్‌, చోడే అనిల్‌, చంటి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement