● అరటి అబ్బురం.. | - | Sakshi
Sakshi News home page

● అరటి అబ్బురం..

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● స్నేహమేరా జీవితం..

● పరంపరగా!

● ఆల మందలం.. రోడ్లు వదలం!

మండలం మొగలిపాలెంలో ఒక పంపర పనస చెట్టు చూపరులను అబ్బుర పరుస్తోంది. ఆవ డ్రెయిన్‌ పక్కన పొలం గట్టుపై ఉన్న ఈ చెట్టు నిండా కాయలతో ఆకర్షిస్తోంది. ఆరడుగుల చెట్టుకు సుమారు 30 కాయలు కాసాయి. దీనికి ఎటువంటి ఎరువు వేయలేదని పొలానికి వేసే ఎరువులను లాక్కుని ఇలా ఎదిగిందని రైతు, తణుకువాడ పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తాడి వెంకటరెడ్డి తెలిపారు. – కాజులూరు

కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకన్నట్టు ఈ అరటి చెట్టు ఎదుగుతున్న క్రమంలోనే కాపు కాసి ఆకట్టుకుంటోంది. మండలంలోని మెరకపాలెంలో యెలుమర్తి బాబూరావు ఇంటి ఆవరణలో అరటిచెట్టు కాండం నుంచి ఏకంగా నాలుగైదు గెలలు వచ్చాయి. నిజానికి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుందని ఆయన తెలిపారు.

– రాజోలు

జాతి వైరాన్ని మరచి ఓ వానరం, ఓ శునకం స్నేహమేరా జీవితం అంటూ పాడుకుంటున్నాయి. మండలం తిరుమలంపాలెంలో నెల రోజులుగా కలిసిమెలిసి తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ జోడీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

– ద్వారకాతిరుమల

పట్టణ పరిధిలోని మార్కెట్‌ యార్డు సమీపంలో సూరవరం రోడ్డులో పశువుల మంద వాహన చోదకులకు స్పీడ్‌ బ్రేకర్లుగా తయారయ్యాయి. మున్సిపల్‌ అధికారులు సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. – తుని

అరటి చెట్టు మొదలు భాగంలో

ఉన్న అరటి గెలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement