రత్నగిరి సెక్యూరిటీ అధికారి అర్హత కుదింపు! | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి సెక్యూరిటీ అధికారి అర్హత కుదింపు!

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌లో మార్పు

● చర్చనీయాంశమవుతున్న క్యాడర్‌

అన్నవరం: రత్నగిరి రక్షణకు నియమించాల్సిన సెక్యూరిటీ అధికారి పోస్టు భర్తీకి అభ్యర్థుల అర్హతలలో సడలింపులు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ పోస్టు భర్తీకి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆర్మీకి చెందిన విశ్రాంత హవల్దార్‌ కానీ, పోలీసు శాఖకు చెందిన విశ్రాంత డీఎస్పీ స్థాయి వారు అర్హులని పేర్కొన్నారు. అయితే 2003లో అప్పటి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ విశ్రాంత సుబేదార్‌ లేదా సుబేదార్‌ మేజర్‌, అలాగే విశ్రాంత డీఎస్పీ లేదా విశ్రాంత సీఐ అర్హులని నోటిఫికేషన్‌ ఇచ్చి సుబేదార్‌ను ఎంపిక చేశారు. సుబేదార్‌ అంటే పోలీసుశాఖలో సీఐతోనూ, హవల్దార్‌ అంటే హెడ్‌ కానిస్టేబుల్‌తో సమానం. కాగా ప్రజాప్రతినిధులు ఎవరైనా తమ మద్దతుదారునితో ఈ పోస్టు భర్తీ చేసేందుకు తక్కువ స్థాయి అధికారి సరిపోతారని అలా నోటిఫికేషన్‌ ఇప్పించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై తాజా నోటిఫికేషన్‌లో అర్హతలు తగ్గిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వడంపై ఈఓ నల్లం సూర్యచక్రధరరావును వివరణ కోరగా గతంలో మాదిరిగానే పోస్టు భర్తీ చేయమని సిబ్బందికి చెప్పానని, ఆర్మీలో క్యాడర్ల తేడా ఇప్పుడే తెలిసిందని దీనిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement