గంజాయి గుప్పుచుప్పుగా.. | - | Sakshi
Sakshi News home page

గంజాయి గుప్పుచుప్పుగా..

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● యథేచ్ఛగా అక్రమ రవాణా

● నియంత్రణలో అధికారులు విఫలం

వీఆర్‌ పురం: గంజాయి అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న గంజాయి రవాణా కేసులే నిదర్శనం. గత శుక్రవారం అడ్డతీగల మండలం వేటమామిడి వద్ద 30 కిలోలు, గుర్తేడు మండలం డొంకరాయి వద్ద 4 కిలోలు, శనివారం తాటిపాకకు చెందిన కనపాల పవన్‌తేజ, బళ్ల ఉదయ్‌, దిగుమర్తి కల్యాణ్‌తేజ నుంచి వంద గ్రాముల గంజాయి, గంజాయి పీల్చేందుకు ఉపయోగించే సిగరెట్‌ బడ్స్‌ను రాజోలు సర్కిల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అసలు గంజాయి సాగే లేదని బకాయిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ దొంగచాటు వ్యవహారంపై ఏం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారు తీసుకుంటున్న నామమాత్రపు చర్యల వల్లే గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని వారంటున్నారు. తాజాగా చింతరేవుపల్లిలో అదివారం గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను ఎస్సై సాధిక్‌ అదుపులో తీసుకుని తీసుకున్నారు. వారి వద్ద నుండి 490 గ్రాముల గంజాయిని, ఆరు మోటర్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి సేవించటం గంజాయి రవాణా చట్టరీత్యా నేరం అన్నారు. గంజాయి సేవిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement