అమలాపురం టౌన్: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ జూ జిట్సు చాంపియన్ షిప్–2026 పోటీల్లో అమలాపురానికి చెందిన బొలిశెట్టి యశస్విని ప్రధమ స్థానం సాధించి స్వర్ణ పతకం కై వసం చేసుకుందని ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్ పడాల అంజి తెలిపారు. అండర్–19 ఫైటింగ్ సిస్టమ్ 60 కేజీల విభాగంలో యశస్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ విజయంతో యశస్విని జాతీయ పోటీలకు ఎంపికై ంది. త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే నేషనల్ జూ జిట్సు పోటీల్లో ఆమె రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. యశస్విని విజయంపై పలు రంగాల క్రీడాకారులు, క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


