పీజీలో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పీజీలో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్‌

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

కాకినాడ రూరల్‌: పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ త్వరలో ప్రకటించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. కాకినాడ రూరల్‌ అచ్చంపేట జంక్షన్‌లో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు శనివారం క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.ప్రశాంతిశ్రీ మాట్లాడుతూ క్యాంపస్‌లో ఆధునిక స్మార్ట్‌ క్లాస్‌రూములు, అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక హాస్టల్‌ వసతి, విస్తృత క్రీడా సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌ అవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ ప్రోత్సాహకాలు విద్యార్థులకు వర్తిస్తాయని చెప్పారు. ప్రతి పీజీ విభాగంలో 33 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే సమయంలో క్యాంపస్‌ కోడ్‌ ఏకేఎన్‌కేను ఎంచుకుని, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌, కాకినాడను తప్పనిసరిగా ఆప్ట్‌ చేసుకోవాలని సూచించారు. ఎంఏలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంగ్లీష్‌, ఎమ్మెస్సీలో మ్యాథమెటిక్స్‌, ఎంకాం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం అడ్మిషన్స్‌ ఇన్‌చార్జి ఎస్‌కె కరీం 9701827564, పి.రాము 7075159585లను సంప్రదించవచ్చని సూచించారు. నేరుగా వర్సిటీ ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌లోనూ సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement