నడవడిక ఆశ్చర్యం కలిగిస్తోంది!
స్వామి సన్నిధిలో గజలక్ష్మి..
ద్వారకాతిరుమల: స్థానిక చినవెంకన్న దేవస్థానంలో ఈ ఏనుగు పేరు గజలక్ష్మి. వయసు 54 ఏళ్లు. 2004 మార్చిలో దాత శరణాల మాలతీరాణి చినవెంకన్నకు బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రమే ఇల్లుగా, స్వామివారి సేవే జీవితంగా ఉంటోంది. బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసం, ఇతర పర్వదినాల్లో, గ్రామోత్సవాల్లో స్వామివారి సేవలో పాల్గొంటుంది. ఇలా ద్వారకాతిరుమలతో 22 ఏళ్ల అనుబంధం ఏర్పడింది. హిందీతో పాటు తెలుగు కూడా కొంతవరకు అర్థం చేసుకుంటోంది. ఏనుగయినా కప్పలంటే భయపడుతుంది. గుర్రాలు, కుక్కలు, ఇతర జంతువులను చూస్తే కంగారుపడుతుంది. అన్నింటి కంటే ఖాకీ రంగు దుస్తులంటే అసలు పడదు. మావటులు మినహా ఎవరైనా అలాంటి దుస్తులతో వస్తే కోపగిస్తుంది. 18 ఏళ్ల క్రితం ఆలయం వద్ద ఓ చిన్నారి తన కాళ్ల మధ్యకు వచ్చినా.. ఎలాంటి హాని చేయకుండా కాలితో పక్కకు నెట్టేయడంతో అప్పుడు భక్తులంతా అభినందించారు. గజలక్ష్మి సంరక్షణకు ముగ్గురు మావటులు ఉన్నారు. ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. రోజుకి 500 కిలోల శాఖాహారం తీసుకుంటుంది. గరిక, చెరకు, బెల్లం, క్యారెట్లు, దోసకాయలు, కొబ్బరి మట్టలు, రావి ఆకులు ఇష్టంగా తింటుంది. ఇలా ఆహారం కోసం దేవస్థానం నెలకు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేస్తోంది. రోజుకు 150 లీటర్లకు పైగా నీరు తాగుతుంది. రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొండపై ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంది.
ఫ మూగజీవాలతో పెనవేసుకున్న
అనుబంధం
ఫ ఉమ్మడి జిల్లాలో అనేకమంది
జంతు సంరక్షకులు
ఫ నేడు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
మాటలు రావు.. కానీ ఎన్నో భావాలు పలికిస్తాయి. స్వార్థం ఉండదు.. స్వచ్ఛమైన ప్రేమను చూపుతుంటాయి. అలాంటి మూగజీవాలు మనిషి జీవితంతో పెనవేసుకుంటున్నాయి. వాటి మౌనంలో మనసు విప్పి పరికిస్తే ఎంతో విలువైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తనివితీరా ఆశ్వాదించొచ్చు. వైజ్ఞానిక జీవితాన్ని గడుపుతున్నామని చెప్పుకొంటున్న మనిషి మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యంతోనో, అజాగ్రత్తతోనో వాటికి నష్టం కలిగించకూడదు. ఆధునిక పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుని వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అలాంటి మూగజీవాలను ప్రేమగా సాకుతూ, సంరక్షిస్తున్న వారెందరో.. కడుపున పుట్టకపోయినా, కన్నబిడ్డలా చూసుకుంటున్న జంతు ప్రేమికులెందరో.. నేడు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికుల హృదయ స్పందన ఇలా.. కపిలేశ్వరపురం
నోట్ చేసుకునేలా..


