పిఠాపురం: స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఆర్చరీ, ఫెన్సింగ్, మోడరన్ పెంటాథ్లాన్ తదితర క్రీడా విభాగాల్లో ఈ ఎంపికలు జరిగాయి. సుమారు 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 80 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.వెంకట్‌రెడ్డి తెలిపారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు..
ముమ్మిడివరం: ఇటీవల ఐ.పోలవరం మండలం జి.వేమవరం హైస్కూల్‌లో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో ముమ్మిడివరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జె.కేదార్‌నాథ్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగినట్లు పీడీ కోన సందీప్ తెలిపారు. ఆ విద్యార్థిని హెచ్‌ఎం బి.హనుమంతరావు తదితరులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు జెడ్పీహెచ్‌ఎస్ విరవలో శిక్షణా శిబిరం నిర్వహించి తుది జట్టును రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని ఖోఖో సంఘ కార్యదర్శి, కోచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు ఖోఖో సంఘ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోవిందరాజులు, జేఎన్టీయూకే స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ జి.శ్యామ్‌కుమార్, ఖోఖో సంఘ అధ్యక్షుడు పట్టాభిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు.


