గంజాయి.. ఆగదోయి | - | Sakshi
Sakshi News home page

గంజాయి.. ఆగదోయి

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

ఫ కొనసాగుతున్న అక్రమ రవాణా

ఫ రోజుకోచోట పట్టుబడుతున్న వైనం

రాజోలు: గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు.. రోజుకోచోట పట్టుబడడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, పోలీసులు మాత్రం గంజాయి రవాణాను ఎక్కడికక్కడే అరికట్టామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రోజూ ఏదొకచోట గంజాయి కేసులు నమోదు కావడం ఇందుకు ఉదాహరణ. శుక్రవారం పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వేటమామిడి వద్ద 30 కిలోలు, గుర్తేడు మండలం డొంకరాయి వద్ద 4 కిలోల గంజాయి పట్టుబడింది. తాజాగా ఈ విక్రయాలు కోనసీమ జిల్లాను తాకాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైథూల్‌ లష్కర్‌తో పాటు తాటిపాకకు చెందిన కనపాల పవన్‌తేజ, బళ్ల ఉదయ్‌, దిగుమర్తి కల్యాన్‌తేజలు గంజాయి విక్రయిస్తున్నట్టు రాజోలు సర్కిల్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్సై మల్లిఖార్జునరెడ్డి నిఘా ఉంచి, ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాముల గంజాయి, గంజాయి పీల్చేందుకు వినియోగించే సిగరెట్‌ బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం రాజోలు సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై మల్లిఖార్జునరెడ్డి వివరాలు వెల్లడించారు. గంజాయి విక్రయించినా, తాగినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. అరెస్ట్‌ చేసిన నలుగురిని రాజోలు కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement