కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రిక గ్రామానికి చెందిన వంగా నల్ల శ్రీను వద్ద రెండేళ్ల మూడు నెలల వయసున్న సైబాల్ జెర్సీ ఆవు ఉంది. గ్రామంలోని ఇనుప వంతెన సమీపంలో ఓ పాడి రైతు సంరక్షణలోని ఆవు పవువుల పాక దగ్ధం కావడంతో కొనఊపిరితో ఉండగా, వైద్యుడు ఆ ఆవు కడుపులోని దూడను నైపుణ్యంతో బయటకు తీశారు. తల్లి ఆవు చనిపోయిన బాధలో పాడిరైతు దూడను చూడలేనంటూ మరెవరైనా సంరక్షించండని కోరాడు. అలా నల్ల శ్రీను సైబాల్ జెర్సీ ఆవును పెంచుతూ వచ్చారు. అనేక మంది అమ్మమంటూ కోరినా, తల్లి లేని దూడను తానే జాగ్రత్తగా చూసుకుంటానని నల్ల శ్రీను చెబుతున్నారు.


