ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో సుమారు రూ.20 కోట్లకు పైగా నిధులతో ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ సహకారంతో సేవా భవనం నిర్మిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్య వైశ్య నాయకుడు కొరుప్రోలు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం రూ.50 వేలతో మూడు వేల మందికి పైగా భక్తులకు దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా ఆర్యవైశ్యుల ఆర్థిక సహకారంతో ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు శివరామ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు సేవా భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.


