రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

దేవరపల్లి: దుద్దుకూరులోని రంగరాయ జెడ్పీ హైస్కూలు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఏలూరులోని సెయింట్‌ థెరిసా జూనియర్‌ కళాశాలలో గత నెల 28న జరిగిన అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీలు జరిగాయి. ఇందులో పైడిమళ్ల హనీ, పొలుమాటి చౌనిక, గొల్లపల్లి భూమిక వారు ప్రతిభ చూపి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు వివరించారు. అలాగే, మండలంలోని రామన్నపాలెం జెడ్పీ హైస్కూల్లో జరిగిన జూనియర్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన బి.ఆకాష్‌బాబు ఎంపికై నట్టు ఆయన తెలిపారు. అతడు అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మన జిల్లా జట్టు తరఫున ఆడతాడని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్ధులను, వ్యాయామోపాధ్యాయులను ప్రధానోపాధ్యాయుడు పి.వీర్రాజు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement