కామన్వెల్త్‌ కబడ్డీ పోటీల రిఫరీగా బోగిళ్ల | - | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ కబడ్డీ పోటీల రిఫరీగా బోగిళ్ల

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

సామర్లకోట: పట్టణానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు, ప్రొ. కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్‌ కామన్వెల్త్‌ కబడ్డీ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వచ్చాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మురళీ కుమార్‌ ప్రస్తుతం జగ్గంపేట జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వీర సావర్కర్‌ స్టేడియంలో జరగనున్న మొదటి కామన్వెల్త్‌ కబడ్డీ చాంపియన్‌షిష్‌కు ఆయన రిఫరీగా వ్యవహరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ టెక్నికల్‌ అఫీషియల్‌గా ఆయన నామినేట్‌ కావడం సామర్లకోటకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement