రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు అస్మిత | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు అస్మిత

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

కరప: మండలంలోని వేళంగి మెర్ల జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పుల్లెపు అస్మిత రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపికై ంది. పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ పాఠశాల మైదానంలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఎస్‌జీఎఫ్‌ బాక్సింగ్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు మాట్లాడుతూ అస్మిత త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. బాలికతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు కంకణాల శ్రీనివాసరావు, గుబ్బల వేణుగోపాలరావులతో పాటు స్థానిక మార్షల్‌ ఆర్ట్స్‌ కోచ్‌ లవరాజును అభినందించారు. అలాగే పాఠశాల వ్యవస్థాపక వారసులు మెర్ల వీరయ్య చౌదరి, బోండా వెంకన్నరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌, సభ్యులు అభినందనలు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక కొత్తపేటకు చెందిన బూరాడ వెంకట రమణమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు సుగర్‌ వ్యాఽధి అధికమై శరీరంపై పుండ్లు తగ్గకపోవడంతో మనస్తాపం చెంది మంగళవారం నిద్ర మాత్రలు మింగేసింది. కుటుంబ సభ్యులు ఆ మెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement