వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

పెద్దాపురం: పెద్దాపురం పురపాలక సంఘంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన 50 కుటుంబాలు ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు నేతృత్వంలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ సంకు దావీదు రాజు ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. పాత పెద్దాపురం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దొరబాబు తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒకటో వార్డుకు చెందిన వీరిని దొరబాబు పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ పట్టణంలో జనాదరణ లేని వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ చెల్లుచీటీ ఇస్తారన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. తమ సొంత ప్రయోజనాలే ధ్యేయంగా చేసుకొని కూటమి పాలన సాగిస్తోందన్నారు. పెద్దాపురంలో కూటమి నేతలు బెదిరింపు రాజకీయాలకు దిగితే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పెద్దాపురంలో ప్రతి కార్యకర్తకూ తాను అండగా ఉంటానన్నారు. తిరిగి పెద్దాపురం చైర్మన్‌ గిరీ జగన్‌మోహన్‌రెడ్డి ఖాతాల్లోకి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను, పెరిగిన నిత్యావసర ధరల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కో డైరెక్టరు ముప్పన వీర్రాజు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు పప్పల బుజ్జి, పట్టణ మైనార్జీ సెల్‌ అధ్యక్షుడు రఫీ, మాజీ కౌన్సిలర్‌ ఆకుల కృష్ణబాపూజీ, పలివెల జనార్ధన్‌, నేతలు జి.మురళి, ఊబా జాన్‌ మోజేస్‌, ఎ.లక్ష్మీనారాయణ, కె.కామేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ జి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement