ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

సామర్లకోట: వీకే రాయపురంలో వరద ముంపు కారణంగా నష్టపోయిన రైతులను గుర్తించాలని అధికారులను కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు. ‘క్రాప్‌ హాలిడే ప్రకటించడమే శరణ్యం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్‌.. గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేట్లపాలెం, బిక్కవోలు వద్ద సర్‌ప్లస్‌ వియర్స్‌ గేట్లు ఎత్తి వేసిన సమయంలో తమ పంటలు మునిగిపోతున్నాయని రైతులు వివరించారు. వరిచేలు ఐదు రోజులుగా ముంపులోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన నష్టానికి ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు వాపోయారు. అధికారులు, సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement