వెన్నుపోటు పార్టీ వంచనపై ˘ బీసీ గర్జన పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పార్టీ వంచనపై ˘ బీసీ గర్జన పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించే బీసీ గర్జన మహాసభను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నాయకులు కోరారు. కాకినాడలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల (జోన్‌–2) బీసీ నాయకుల మహాసభ ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన‘ పేరిట రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా నేతలు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌ వెంకటాద్రి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ఈ మహాసభకు ఉమ్మడి గోదావరి జిల్లాల బీసీ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ జెడ్పీటీసీలు గుబ్బల తులసి కుమార్‌, నులుకుర్తి కిట్టు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, నేతలు అనుసూరి ప్రభాకర్‌, ఆవాల లక్ష్మీనారాయణ, సీహెచ్‌ చక్రవర్తి, వాసుపల్లి కృష్ణ, రేపాటి శ్రీనివాసరావు, శరణం శ్రీను, పితాని కాశీ విశ్వనాథ్‌, కాదా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement