దేవరపల్లి: ప్రకాశం జిల్లా బాపట్ల కాజీపాలెంలో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల విభాగం రాష్ట్రస్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీల్లో తూర్పుగోదావరి బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ జిల్లాకు చాంపియన్ షిప్ దక్కిందని టెన్నిస్‌బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు తంగెళ్ల మునేశ్వరరావు, చెల్లయమ్మ సోమవారం తెలిపారు. జట్టులో చిక్కాల, చిన్నాయగూడెం, గోపాలపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థులున్నారని మునేశ్వరరావు తెలిపారు. జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలవడానికి పీడీలు కేవీవీ సత్యనారాయణ, డి.అశోక్, టి.గంగాధరరావు కృషి చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా జట్టులో మండలంలోని చిన్నాయగూడెం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ముగ్గురు పాల్గొని ప్రతిభ చూపినట్టు పీడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. జట్టులో పి.సిరి చందన, ఎం.కీర్తన ఆడినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.


