పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

ఆర్‌జేడీ నాగమణి

డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ

రాజమహేంద్రవరం రూరల్‌: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్‌–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్‌–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్‌ అడాప్ట్‌ లెర్నింగ్‌ (పాల్‌ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్‌ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్‌ సమన్వయకర్త కిశోర్‌ బాబు, సీమాట్‌ సీనియర్‌ లెక్చరర్‌ ఎస్‌.ప్రసాద్‌, సమగ్ర శిక్ష సీనియర్‌ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్‌ మోనిటరింగ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌ కుమార్‌, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement