ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు | - | Sakshi
Sakshi News home page

ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రమవుతుండడంతో ఏలేరు జలశయంలో నీటినిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీటి సరాఫరా అంతంతమాత్రంగా ఉండడంతో దిగువ ఆయకట్టుకు నీటి సరాఫరా తగ్గించారు. శనివారం నాటికి ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.38 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.58 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దిగువ ఆయకట్టుకు 600, విశాఖకు 225, పంపాకు 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి సరాఫరా నిలిపివేశారు.

సీతారామ సత్రానికి

రూ.5 లక్షల విరాళం

తొలి విడతగా రూ.2.6 లక్షలు అందజేత

అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్‌.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్‌ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు.

గోదావరి దాటిన పెద్ద పులి

దేవీపట్నం: గడిచిన రెండు వారాలుగా దేవీపట్నం మండలంలోనే తిష్ట వేసిన పెద్ద పులి ఎట్టకేలకు గోదావరి దాటింది. దేవీపట్నం, లింగవరం గ్రామాల వద్ద ఐదు రోజుల పాటు మకాం ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉంటుందని భావించినప్పటికీ పులి తన గమనాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దేవీపట్నం, లింగవరం గ్రామాల సమీపంలో గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సంగనపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పులికి అమర్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దేవీపట్నం తరహాలోనే అక్కడ కూడా సమృద్ధిగా నీరు, పులికి ఆహారం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద పులి వచ్చిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరి జిల్లా దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రలోని తడోబా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పులి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement