స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాద రూరల్‌: సామాజిక రుగ్మతలను రూపుమాపాలని పెద్ద ఎత్తున ఉద్యమించిన మహాత్మా జ్యోతిరావుఫూలే స్ఫూర్తి ప్రధాత అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఫూలే జయంతిని రమణయ్యపేట వైద్యనగర్‌లోని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో ఫూలే చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి ఎప్పటికీ చిరస్మరణీయులన్నారు. ఆ రోజుల్లో మహిళా విద్య కోసం సావిత్రీబాయి పోరాడారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాలు, పేద వారి కోసం జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో పని చేశారన్నారు. పార్టీ తరఫున పేదల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా కన్నబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు, పార్టీ నాయకులు అనుసూరి ప్రభాకరావు, ఇసుకపట్ల లక్ష్మీ కుమారి, ప్రసన్న, సవరం చిట్టిబాబు, నల్ల శ్రీను, జాన్‌ ప్రభాకర్‌, పాము సూరిబాబు, కృప, భావవరం రవి, దుగ్గన దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement