
ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు పెంపు
అమలాపురం టౌన్: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ముందుగా ప్రకటించిన ఈ నెల 10వ తేదీ కాకుండా, ఆ గడువును ఈ నెల 22 వరకూ ఇంటర్మీడియెట్ విద్యా మండలి పెంచిందని డీఐఈఓ వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ విషయాన్ని అమలాపురంలో శుక్రవారం ఆయన తెలిపారు. గడవు తర్వాత ఈ నెల 30వ తేదీ వరకూ రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు.
మ్యాఽథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ : అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణల నిమిత్తం మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొని బోధనా అంశాలపై చర్చించారు. డీఐఈఓ సోమశేఖరరావు హాజరై అధ్యాపకులకు పలు అంశాలు వివరించారు.