అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల విక్రయానికి ఏడాదికి రూ.రెండు కోట్లకు వేలం పాడాం. దీనికి జీఎస్టీ అదనం. గతంలో కాయ ఒక్కంటికి రూ.25 రేటు మంజూరు చేశారు. ఐదు నెలలుగా కొబ్బరి తోటలోనే కాయ రూ.30కి కొంటున్నాం. వాటిలో చిన్నకాయలు కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ ధర పలుకుతాయి. కొన్ని కాయలు రవాణాలో పాడైపోతాయి. అవన్నీ మాకు నష్టమే. తోట నుంచి దేవస్థానానికి తేవడానికి రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.రెండు నుంచి రూ.మూడు అవుతాయి. అంటే కనీసం కొబ్బరి కాయ రూ.33 వరకు మాకే ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు తమిళనాడు నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ కూడా అదే రేటు ఉంటోంది. అంటే కొబ్బరికాయ రూ.35 కి అమ్మితే మాకు అసలు రేటు పడుతుంది. ఆ మేరకు రేటు మంజూరు చేయాలి. డీమార్ట్, స్మార్ట్‌బజార్ లోనే కొబ్బరి కాయ రేటు రూ.30 దాటి విక్రయిస్తున్నారు. అందువలన దేవస్థానం అధికారులు మార్కెట్ లో కూడా వాకబు చేసి కొబ్బరి కాయ రేటు రూ.35 కి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలి.
– వీర్ల సూరిబాబు, కొబ్బరికాయల దుకాణం పాటదారుడు