222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు

Oct 12 2025 7:16 AM | Updated on Oct 12 2025 7:16 AM

222 స

222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు

కాకినాడ క్రైం: జిల్లా పరిధిలో 222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆరు నెలల వ్యవధిలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును ప్రస్తావించారు. స్కానింగ్‌ కేంద్రాల్లో ముమ్మర తనిఖీల వల్ల భ్రూణ హత్యలు తగ్గాయని తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన 159 స్కానింగ్‌ కేంద్రాలలో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య మొత్తం 222 స్కానింగ్‌ కేంద్రాలలో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. చట్ట వ్యతిరేకంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో అన్నారు. అలా చేస్తున్న స్కానింగ్‌ కేంద్రాల వివరాలతో పాటు, అనుమతులు లేకుండా పరీక్షలు చేస్తున్న కేంద్రాలు, వైద్యుల వివరాలను టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 3365 లేదా 94941 13365 (వాట్సాప్‌ నంబరు)కు అందించాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

శృంగార వల్లభుని ఆదాయం రూ.3 లక్షలు

పెద్దాపురం(సామర్లకోట): మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన స్వామివారి ఆలయానికి శనివారం జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,65,610, అన్నదాన విరాళాలకు రూ.1,08,476, కేశ ఖండన ద్వారా రూ.5,640, తులాభారం ద్వారా రూ.600, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,365, మొత్తంగా రూ.3,02,691 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.

బాక్సింగ్‌ పోటీలలో ప్రమాణాలు నిల్‌

ప్రకాశం నగర్‌: 69వ అంతర్‌ జిల్లాల బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీ బాక్సింగ్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి వైవీఎస్‌ ఉమామహేశ్వరరావు అరోపించారు. శనివారం స్థానిక ఎస్‌కేవీటీ పాఠశాలలో జరుగుతున్న పోటీలకు ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు అసోసియేషన్‌ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓపెన్‌ రింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల పలువురు క్రీడాకారులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అందోళన వ్యక్తం చేశారు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం రెండు పోటీలు నిర్వహించాల్సి ఉండగా, రోజుకు నాలుగు పోటీలు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. క్వాలిఫైడ్‌ జడ్జిలు, రిఫరీలు లేకుండా కేవలం బయట కోచ్‌లను తీసుకువచ్చి పోటీలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు.

222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు 1
1/1

222 స్కానింగ్‌ కేంద్రాలలో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement