నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్ముడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్న సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు.
–తండ్రి సత్యనారాయణతో
సప్పా నాగేశ్వరరావు,
కొంకుదురు
ఎంతో ప్రేమగా చూస్తారు..
సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను.
–తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు
మాకు మంచి స్నేహితుడు
మాకు మంచి స్నేహితుడు