గాంధీజీ, శాసీ్త్రజీలకు హైకోర్టు న్యాయమూర్తి నివాళి | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ, శాసీ్త్రజీలకు హైకోర్టు న్యాయమూర్తి నివాళి

Oct 3 2023 1:48 AM | Updated on Oct 3 2023 1:48 AM

- - Sakshi

అన్నవరం: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి వేడుకలు సోమవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. రామాలయం వద్ద విశ్రాంతి మండపంలోని వేదికపై గాంధీజీ, శాసీ్త్రజీల చిత్రపటాల వద్ద పండితులు పూజలు చేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలకృష్ణరావు దంపతులు, దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేద పండితులు నీరాజనాలు సమర్పించారు. చివరలో జనగణమణ గీతాన్ని దేవస్థానం ఫార్మసీ సూపర్‌వైజర్‌ వి.మాధవి ఆలపించారు. దేవస్థానంలో ఇప్పటి వరకూ స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. గాంధీజీ, శాసీ్త్రజీ జయంతి వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమం.

వైద్య విభాగం సంయుక్త

కార్యదర్శిగా బ్రహ్మానందరెడ్డి

కాకినాడ: వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డాక్టర్‌ ఎన్‌.బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర స్థాయి క్రీడా అకాడమీకి

6న జిల్లా స్థాయి ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని రాష్ట్ర క్రీడా అకాడమీకి ఈ నెల 6న కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) చీఫ్‌ కోచ్‌ శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఈ విషయం తెలిపారు. బ్యాడ్మింటన్‌, హాకీ, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో 30 మంది చొప్పున బాలురకు అవకాశం ఉంటుందని వివరించారు. 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. రాష్ట్ర స్థాయిలో 10 నుంచి 13వ తేదీ వరకూ ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆరో తేదీ ఉదయం 8 గంటలకు అర్హత పత్రాలతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 89196 42248 నంబరులో సంప్రదించాలని సూచించారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన ట్రస్టుకు మామిడికుదురు దీప్తి విద్యాసంస్థల అధినేత దూళిపూడి వీరవెంకట సత్యనారాయణ, భ్రమరాంబ దంపతులు సోమవారం రూ.41,116 విరాళం సమర్పించారు. వారి కుమార్తె లక్ష్మీసాయిదీప్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నవంబరు 20న అన్నదానం చేయాలని ఈ విరాళం అందించారు. దాత దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, గూటం శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకుడు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, ఉద్యోగులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

రాష్ట్ర యోగా పోటీలకు ఎంపిక

కొత్తపేట: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికై నట్లు వివేకానంద యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకుడు ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ హాస్టల్‌ విద్యార్థులకు కొంత కాలంగా శ్రీనివాస్‌ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో రిటైర్డ్‌ పీఈటీ, జాతీయ యోగా పోటీల జడ్జిగా వ్యవహరించిన మోటూరి భైరవస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో స్థానిక హాస్టల్‌ విద్యార్థులు ఎలీషారాజ్‌, అభి, సిద్ధార్థ, ప్రజిత్‌, సుధీర్‌, చరణ్‌, శాంబాబు ఎంపికయ్యారు. వారు ఈ నెల 20న విశాఖపట్నంలో జరిగే పోటీల్లో పాల్గొంటారని శ్రీనివాస్‌ తెలిపారు. విజేతలను హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జి.పవన్‌కుమార్‌ అభినందించారు.

దాత డీవీఎస్‌ కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఉద్యోగులు1
1/2

దాత డీవీఎస్‌ కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ ఉద్యోగులు

గాంధీజీ, శాసీ్త్రజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న జస్టిస్‌ గోపాలకృష్ణారావు, ఈఓ ఆజాద్‌ 2
2/2

గాంధీజీ, శాసీ్త్రజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న జస్టిస్‌ గోపాలకృష్ణారావు, ఈఓ ఆజాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement