గద్వాలన్యూటౌన్: ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు ఉంటుందని వాతావరణశాఖ తేల్చింది. ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీటి సంరక్షణ ఒక్కటే మార్గమని భావించింది. ఈ నేపథ్యంలోనే వీబీ–జీ రామ్జీ కింద నీటి సంరక్షణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, పెర్కోలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీచార్జి నిర్మాణాలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి.
ఎల్నినో ఎఫెక్ట్..
ఈ ఏడాది ఎల్నినో కారణంగా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. భూగర్బ జలాలు అడుగంటాయి. జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఇది ఇప్పటికే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం పడనుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువై యాసంగి సీజన్లో భూగర్బ జలాలు మరింత అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. యాసంగిలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుంది. తాగునీటికి సైతం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నీటి సంరక్షణపై దృష్టి..
ఎల్నినో వంటివి భవిష్యత్లో మరెన్నో వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో నీటి సంరక్షణ ద్వారా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవచ్చనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వీబీ–జీ రామ్ జీ కింద నీటి సంరక్షణ పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్ (నీటి కుంటలు). పెర్కోలేషన్ ట్యాంక్స్, బోర్ రీచార్జి, ఓపెన్ వెల్స్ నిర్మాణాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ముందుగా ప్రతిపాదనలు రూపొందించి, మంజూరు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే కలెక్టర్ ప్రత్యేక సమీక్షల ద్వారా పనుల పురోగతి తెలుసుకుంటూ, నిర్మాణాలు వేగవంతమయ్యేలా సంబంధిత అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
దిగివచ్చిన ఉల్లి ధర
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలం పాటలో ఉల్లి ధర తగ్గుముఖం పట్టింది.
–IIలో u
ఇవీ ప్రయోజనాలు..
వ్యవసాయ పొలాల్లో ఫారం పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. వర్షాభావంలో నీటి కొరతను నివారిస్తుంది. అలాగే గ్రామ పరిసరాల్లో పెర్కోలేషన్ ట్యాంక్లు నిర్మిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి అవుతాయి. ఇళ్లలో వినియోగించిన నీటిని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి, భూగర్బ జలాలు పెరిగేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయి. వీటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బోర్వెల్ల చుట్టూ గుంతలు తీసి, నిర్మాణం చేయడం వల్ల వర్షపు నీరు బోర్వెల్ లోపలికి వెళ్లి రీచార్జి చేస్తుంది. ఓపెన్ వెల్ చుట్టూ నిర్మాణం చేయడం వల్ల భూగర్భజలమట్టం పెరుగుతుంది. ఇలా నీటి సంరక్షణ పనులతో సాగు, తాగునీటి కొరతను అధిగమించవచ్చు. ఇదే సమయంలో ప్రస్తుతం కూలీలకు వ్యవసాయ పనులు లేవు. నీటి సంరక్షణ పనులతో కూలీలకు ఉపాధి లభిస్తుంది.


