సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

కొల్లాపూర్‌: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుహౌజ్‌లో రెండు బహుబలి మోటార్లను బుధవారం ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద మంత్రి జూపల్లి విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేసి, రైతాంగానికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ.. ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయకుండానే జాతికి అకింతం చేశారని విమర్శించారు. కాగా, పాలమూరు ప్రాజెక్టులో సాంకేతిక సమస్యల కారణంగా నీటి ఎత్తిపోతలు కేవలం 2.15 గంటలు మాత్రమే కొనసాగాయి. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో నీటి పంపింగ్‌ను సాయంత్రం 5.30 గంటలకే అధికారులు నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement