డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.. అందరివాడు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.. అందరివాడు

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

గట్టు: ప్రజాస్వామ్య వ్యవస్థను సృష్టించిన అంబేడ్కర్‌ కొందరివాడు కాదు.. అందరివాడు అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఆలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్‌ భారత రాజ్యాంగం రచించి.. నేటికి 76 ఏళ్లు గడిచిందన్నారు. నేటి యువత అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా గుర్తింపు పొంది.. నేటి సమాజంలో అన్నివర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుందన్నారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాల మూలంగా నేడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు దక్కుతున్నట్లు చెప్పారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందంటే అది ఆలూరు గ్రామస్తుల త్యాగం అన్నారు. గ్రామంలో అన్నివర్గాల వారు కలిసిమెలిసి జీవిస్తూ, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గద్వాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, నాయకులు రామన్‌గౌడు, విజయ్‌కుమార్‌, కుర్మన్న, సర్పంచు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

● అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ది సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. ఆలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో ఆమె పాల్గొని వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు నర్సింహులు, బాలకృష్ణ, నాయకులు వెంకటస్వామిగౌడు, గౌస్‌, మహబూబ్‌పాష తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ నూతన విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బల్గెర హన్మంతునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement