నేటి నుంచి నీటి సరఫరా నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నీటి సరఫరా నిలిపివేత

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు సోమవారం నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు ఎస్‌ఈ చంద్రశేఖర్‌ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.445 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని.. ఎగువ నుంచి వరద రావడం లేదన్నారు. జూరాల ఆయకట్టును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. తిరిగి ఏడురోజుల అనంతరం మరో 3 రోజుల పాటు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని వివరించారు.

డీ–6 పరిధిలో పంటలు ఎండుముఖం..

ఆత్మకూర్‌ మండలంలోని కట్టకింది పల్లెలకు సాగునీరు అందించే డీ–6 కాల్వల పరిధిలో ఇప్పటికే రెండు వేల ఎకరాల్లో వరిపంట ఎండుముఖం పట్టడంతో ఆయా గ్రామాల రైతు లు ఆందోళన చెందుతున్నారు. నిరంతరం సా గునీరు అందిస్తేనే పంటలు చేతికొస్తాయని.. లేనిపక్షంలో తమకు నష్టాలు తప్పవంటున్నా రు. ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకొని సా గునీరు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement