రాజోళి: రాజోళి శివారులో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల డ్యాంను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ నిపుణులతో కూడిన బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు డ్యాంపై కలియదిరిగి.. కట్ట నిర్మాణం, క్రస్ట్ గేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్యాం భద్రత, నీటి విడుదల, స్టోరేజీ వివరాలను డ్యాం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరత, నివారణ, పొదుపు చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ చైర్మన్ పరమేశం, రిటైర్డ్ ఇంజినీర్లు శ్రీలక్ష్మి, శ్రీకాంత్, శివకుమార్‌బాబు, డ్యాం జేఈ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


