అలంపూర్: సర్ ప్రక్రియను వేగవంతం చేసి.. నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో మొత్తం 2,42,049 మంది ఓటర్లు ఉండగా.. 2,17,755 ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 89 శాతం ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. ఇంకా 22,994 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. బీఎల్‌ఏలు బూత్ లెవల్‌లో సమావేశాలు నిర్వహించి.. వందశాతం పూర్తిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, మార్కెట్‌యార్డులో డవిజన్‌స్థాయి ప్రజావాణి కొనసాగింది. ఉండవెల్లి మండలం మారమునగాల–2 గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధరణిషా, ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప తదితరులు ఉన్నారు.


