దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

ధరూరు: మండల కేంద్రంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ హుస్సేనప్ప సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగి్‌ల్‌ష్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో (పీజీ) 55 శాతం మార్కులు, సెట్‌, నెట్‌, పీహెచ్‌డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7న కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ స్థలాల

సంరక్షణకు కృషి

అలంపూర్‌: మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ రాజేశ్‌ అన్నారు. స్థానిక 4వ వార్డులోని ప్రభుత్వ స్థలంలో సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఖాళీ స్థలానికి సంబంధించి యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిపై ఎవరికై నా యాజమాన్య హక్కు, స్వాధీనం లేదా ఇతర చట్టబద్ధమైన హక్కులు ఉంటే మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

పల్లీ క్వింటా రూ.8,600

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 420 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,600, కనిష్టంగా రూ. 3,189, సరాసరి రూ. 8,343 ధరలు పలికాయి.

బీచుపల్లి గురుకులంలో ప్రవేశాలకు అవకాశం

ఎర్రవల్లి: బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 5 నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బీచుపల్లి గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 81069 63904 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

434 మెగావాట్ల

విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం 11 యూనిట్ల ద్వారా 44.925 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234, దిగువలో 5 యూనిట్లలో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 44.925 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టినట్లు ఎస్‌ఈ తెలిపారు.

డీసీసీబీ సీఈఓగా

షఫీ ఉల్లాఖాన్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మహమ్మద్‌ షఫీ ఉల్లాఖాన్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్‌ ఖుష్బూగుప్తాను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో సహకార బ్యాంకుసేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement