పిల్లల మానసిక ప్రవర్తనను తల్లిదండ్రులు గ్రహించాలి. కుటుంబ సభ్యులు వ్యవహరించే తీరుకు అనుగుణంగా పిల్లల ధోరణి ఉంటుంది. వారు అనుకునే వాటిని దక్కించుకునేందుకు మొండిగా వ్యవహరించడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. లేని తరుణంలో కౌన్సెలింగ్ చేస్తూ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేయాలి. – సరోజమ్మ,
నాగర్‌దొడ్డి, మల్దకల్ మండలం
జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పిల్లలను గారాబం చేయడం వల్ల వారిలో మొండితనం పెరుగుతుంది. అవసరానికి మించిన డబ్బులు, వస్తువులు ఇస్తూ.. దారి తప్పేలా చేస్తున్నారు. పిల్లలతో స్నేహంగా ఉంటూనే, వారిని గమనిస్తూ ఉండాలి. వారుచేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ సరిచేయాలి. క్రమశిక్షణ వారికి రక్షణ కవచంగా ఉండాలి. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించిన, ప్రమాదాలకు కారకులైన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
– మొగిలయ్య, డీఎస్పీ
●


