● జిల్లాలో ఏటేటా పెరుగుతున్న
పోక్సో కేసులు
● ఏడు నెలల్లోనే 32 కేసులు నమోదు
● నిందితులకు కఠిన శిక్షలు
పడుతున్నా మారని తీరు
● ఇరు కుటుంబాలకు తప్పని వేదన
గద్వాల క్రైం: కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. యుక్త వయసులోని పిల్లలపై ఆదరణ, ప్రేమానురాగాలు చూపించకపోవడం సవాల్‌గా మారుతోంది. కుటుంబ పోషణ కోసమంటూ ఇళ్లు వదిలి కూలీ పనులకు వెళ్తుండటం.. ఇదే క్రమంలో ఒంటరిగా ఉంటున్న బాలికలపై యువకులు వక్రబుద్ధితో లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అత్యాచార ఘటనలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఏటేటా పోక్సో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడు నెలల వ్యవధిలోనే 32 పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చెడు వ్యసనాలకు లోనై..
కొందరు యువత ప్రధానంగా మొబెల్స్, మద్యం, గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు చూడటం.. యుక్త వయసులో కలిగే మార్పుల నియంత్రణ లేకపోవడం కారణంగా ఒంటరిగా ఉంటున్న బాలికలపై ప్రేమ పే రుతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అ యితే తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం కూ లీ పనులకు వెళ్లడం సైతం నిందితులకు కలిసి వ స్తుంది. పిల్లలకు వ్యక్తిగత విషయాలు, అభిరుచు లు, మారుతున్న వ్యవస్థకు తగ్గట్టు వివరించకపోవడం కూడా సమస్యగా మారింది. తీరా కేసుల్లో ఇరుక్కొని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
కనిపించని మార్పు..
బాలికలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడే పోకిరీలపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. బాధితుల ఫిర్యాదులపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి.. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. కోర్టులో వీలైనంత త్వరగా చార్జీషీట్ దాఖాలుచేసి.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో భరోసా, షీ టీం బృందాల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. పోక్సో కేసులతో జైలుశిక్ష అనుభవించాల్సి రావడంతో పాటు భవిష్యత్ శూన్యంగా మారుతుంది. అయినప్పటికీ కొందరు యువకుల్లో మార్పు రావడం లేదు.
సంవత్సరం కేసులు
2024 44
2025 51
2026 32
మొత్తం 127
బాలికలపై చోటుచేసుకునే ఘటనలపై పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేస్తున్నాం. బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో ఎంతో మంది నిందితులకు న్యాయస్థానంలో జైలుశిక్ష తీర్పులు వెల్లువడ్డాయి. ప్రజల్లో మార్పునకు నిత్యం అవగాహన సదస్సుల ద్వారా చైతన్యం కల్పిస్తున్నాం. యువకుల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి కార్యకాలాపాలపై ఆరా తీయాలి. బాలికలను ఒంటరిగా విడచి వెళ్లకుండా.. వారిని సైతం తమ వెంట తీసుకెళ్లాలి. మంచి, చెడ్డును సున్నితంగా వివరించాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ
మచ్చుకు కొన్ని ఘటనలు..
జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలికతో బంధువు వరుస ఉన్న యువకుడు చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సదరు యువకుడు బాలికను నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. ఎవరు లేని ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత బాలికకు కడుపునొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గత నెల 18న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
జిల్లా కేంద్రానికి చెందిన బాలికతో ఓ యువకుడు స్నేహంగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఆ యువకుడు సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత జూన్ 30న పోక్సో కేసు నమోదు చేసి, సదరు యువకుడిని జైలుకు పంపించారు.
గత మే 9న మానవపాడు మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు జరిగిన వి షయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకుడిపై పో క్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.


