గద్వాలన్యూటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేసి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.60లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు సా మాజిక భద్రత కల్పించాలని తెలంగాణ టీచ ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పీఆర్సీ, డీఏలతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నం. 317 అనుబంధంగా జారీ చేసిన జీఓ నం. 190 ఉపాధ్యాయులకు అమలుచేసి, సర్వీస్ రూల్స్ ను నవీకరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో టీటీ యూ నాయకులు ప్రతాప్, లక్ష్మీనారాయణ, మహబూబ్, గజేంద్ర ఉన్నారు.
11 యూనిట్లలో
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు.
ప్రాణాలను
పణంగా పెట్టొద్దు
అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్‌ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్‌కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.


