రేపు అమరవీరులకు వందన కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

రేపు అమరవీరులకు వందన కార్యక్రమం

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

గద్వాలన్యూటౌన్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2న జిల్లా కేంద్రంలోని కొట్టం వేణుగోపాల్‌ పార్కులో 1969 తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు వందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు తెలిపారు. ఆదివారం కొట్టం వేణుగోపాల్‌ పార్క్‌లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరులైన పాశం సర్వారెడ్డి, కొట్టం వేణుగోపాల్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా ఉదయం 9గంటలకు జరిగే వందన కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి కవులు, ఉద్యమకారులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలరాజు, శంకర ప్రభాకర్‌, వల్లూరు వెంకట్రామారెడ్డి, భీమ్‌సేన్‌రావు, అబ్దుల్‌ మోమిన్‌, లక్ష్మణస్వామి, హమ్మద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో పుర కమిషనర్ల బదిలీలు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్‌.రాజయ్య (గ్రేడ్‌–2) నారాయణపేట జిల్లాలోని మక్తల్‌కు బదిలీపై వెళ్తున్నారు. ఇంత వరకు వెయిటింగ్‌ జాబితాలో ఉన్న మహమ్మద్‌ మునవర్‌ అలీ (గ్రేడ్‌–3)ని వనపర్తికి, ఎ.నరేష్‌కుమార్‌ (గ్రేడ్‌–3)ను ఆత్మకూర్‌కు, ఎం.శంకర్‌ (గ్రేడ్‌–2)ను నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌కు బదిలీ చేశారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2)గా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌కు వస్తున్నారు. కాగా.. ఇటీవల గ్రూప్‌–1కు ఎంపికై న పి.రాజేష్‌ అలంపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2)గా, పి.సాయి శ్రీనివాస్‌యాదవ్‌ మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ (ఏఎంసీ)గా బదిలీపై వస్తున్నారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన ఏఎంసీ అజ్మీర రాజన్న గత నెలలో హైదరాబాద్‌లోని సెక్రెటరియట్‌కు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డిని వడ్డేపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ (ఓడీ)గా పంపిస్తున్నారు. అలాగే వనపర్తిలో మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–1)గా పనిచేస్తున్న ఎన్‌.వెంకటేశ్వర్లు జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు.

మున్సిపాలిటీలో

మురుగు తొలగేదెలా?

రోడ్లపైనే నిలుస్తున్న మురుగు,వర్షపు నీరు

Advertisement
 
Advertisement
Advertisement