షీటీంతో మహిళలకు భరోసా : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

షీటీంతో మహిళలకు భరోసా : ఎస్పీ

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

గద్వాల క్రైం: మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా.. వేధింపులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రటనలో తెలిపారు. గత మార్చి నెలలో జిల్లావ్యాప్తంగా మహిళా చట్టాలపై 19 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాల్లో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలను వేధించిన 11 మందిపై పెట్టి కేసులు నమోదు చేసి 106 హాట్‌స్పాట్‌లపై నిఘా ఉంచామన్నారు. షీటీం సమస్యలపై అందిన రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా మహిళలపై దురుసుగా వ్యవహరించినా డయల్‌ 100 లేదా సెల్‌ నం.87126 70312కు సంప్రదించాలని సూచించారు. షీటీం మహిళలకు భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పల్లీ @ రూ.7,419

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు మంగళవారం 803 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,419, కనిష్టంగా రూ.4,217, సరాసరిగా రూ.5,889 ధరలు లభించాయి. అలాగే 402 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.5,669, సరాసరిగా రూ.6,029 పలికాయి. 19 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,569, కనిష్టంగా రూ.5,529, సరాసరిగా రూ.6,329 వచ్చాయి. 21 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,439, కనిష్టంగా రూ.1,859, సరాసరిగా రూ.2,029 చొప్పున లభించాయి.

‘చలో వరంగల్‌’కు

తరలిరండి

రాజోళి: రాష్ట్ర విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జాయింట్‌ కమిటీ పిలుపుమేరకు బుధవారం చేపట్టిన చలో వరంగల్‌ కార్యక్రమానికి తరలిరావాలని జోగుళాంబ గద్వాల జిల్లా జేఏసీ చైర్మన్‌ శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్టిజన్‌ కార్మికులు చేపట్టే నిరవదిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని, స్పాట్‌ బిల్డర్లకు జీఓ 11 ప్రకారం వేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సుధాకర్‌, రాముడు, అనంతరెడ్డి, సతీష్‌, లోకేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలభవన్‌లో సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం

గద్వాల న్యూటౌన్‌: జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో ఈ నెల 24 నుంచి జూన్‌ 2 వరకు సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, శాసీ్త్రయ నృత్యం, జానపద నృత్యం, గాత్ర సంగీతం, డ్రాయింగ్‌, వాయిద్య సంగీతం, కుట్లు, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 5 నుంచి 16 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. సాధారణ ఫీజు రూ.50 కాగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.20 మాత్రమే ఫీజు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. శిబిరంలో చేరే విద్యార్థులు ఆధార్‌, విద్యార్హత ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువపత్రాల జిరాక్స్‌తోపాటు పాస్‌పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 96668 53335, 94409 81190లను సంప్రదించాలని సూచించారు.

పాఠశాల భవన

నిర్మాణం పూర్తిచేయాలి

ధరూరు: మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కుర్వవీధి లో అర్ధంతరంగంగా ఆగిపోయిన నిర్మాణ పనులను జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను పరిశీలించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం ఆంజనేయులుకు సూ చించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్‌తోపాటు మధ్యాహ్న భోజన రిజిష్టరును తనిఖీ చేశారు. గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement