కాళ్లు పట్టుకుంటాం.. కనికరించండి | - | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకుంటాం.. కనికరించండి

Mar 24 2026 7:04 AM | Updated on Mar 24 2026 7:04 AM

మానవపాడు: ‘‘మాకు వారసత్వంగా దక్కాల్సిన భూమిని నకిలీ పత్రాలతో కాజేశారు.. మాకు న్యాయం చేయండి’’ అంటూ ఓ మహిళ తహసీల్దార్‌ కాళ్లు పట్టుకుంది. ఈ ఘటన మానవపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బోరవెల్లికి చెందిన బిచ్చన్న – మంగమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మంగమ్మ పేరుపై బోరవెల్లి, ధర్మవరం శివారుల్లో 4.53 ఎకరాల భూమి ఉంది. ఆమె నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. ఆ భూమి ఆమె ఐదుగురు కూతుళ్లకు సమానంగా చెందాల్సి ఉండగా.. మూడో కూతురు వరలక్ష్మి తానే ఏకై క వారసురాలినంటూ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ సృష్టించి భూమిని తన పేరుపైకి మార్చుకుంది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని మిగతా నలుగురు నెల రో జులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం తహసీల్దార్‌ జోషి శ్రీనివాస్‌ శర్మ కాళ్లు పట్టుకొని తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి తప్పుడు స క్సెషన్‌ను రద్దు చేస్తామని త హసీల్దార్‌ హా మీ ఇచ్చారు.

నకిలీ పత్రాలతో వారసత్వ భూమి

కాజేశారని తహసీల్దార్‌తో మొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement