● ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానేపన్నుల వసూళ్లు
● గడువు సమీపిస్తుండటంతో వేగం పెంచిన అధికారులు
● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్
● పుర ఎన్నికలు,
సిబ్బంది కొరతతోనే జాప్యం
నారాయణపేట/ అమరచింత: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్‌కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు.
తొమ్మిదో స్థానంలో వడ్డేపల్లి..
పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచింది. 4,116 ఆస్తులకుగాను రూ.1.07 కోట్ల డిమాండ్ ఉండగా.. వరకు రూ.0.81 కోట్లు (75.70 శాతం) వసూలయ్యాయి. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పురపాలికలో 6,445 ఆస్తులుండగా.. రూ.2.11 కోట్ల డిమాండ్‌కు రూ.1.66 కోట్లు(55.17 శాతం) పన్ను వసూలు చేయడంతో 65వ స్థానంలో.. మద్దూరు మున్సిపాలిటీ 3,177 ఆస్తులకుగాను రూ.0.49 కోట్లకు గాను రూ.0.36 కోట్లు (72.86) పన్ను వసూలు చేయడంతో 12వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్‌లో 6,517 ఆస్తులుండగా.. రూ.1.32 కోట్లకుగాను రూ.0.74 కోట్లు (55.91 శాతం) వసూలు చేసి 61 స్థానంలో నిలిచింది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ మున్సిపాలిటీలో 7,629 ఆస్తులకుగాను రూ.2.16 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.1.23 కోట్ల (56.81 శాతం) పన్ను వసూలు కావడంతో రాష్ట్రస్థాయిలో 59వ స్థానంలో నిలిచింది.
మున్సిపాలిటీ ఆస్తులు లక్ష్యం వసూలైంది శాతం రాష్ట్రస్థాయిలో
(రూ.కోట్లలో..) స్థానం
మహబూబ్‌నగర్ 53,751 51.98 18.75 36.07 121
జడ్చర్ల 18,976 7.03 3.26 46.32 93
వనపర్తి 18,616 12.94 4.29 33.14 124
గద్వాల 16,097 7.51 3.94 52.52 74
నాగర్‌కర్నూల్ 10,998 7.01 3.74 53.31 69
నారాయణపేట 9,304 3.87 2.04 52.71 73
కల్వకుర్తి 8,295 6.77 2.85 42.10 111
అయిజ 8,186 2.09 1.51 72.30 13
మక్తల్ 7,629 2.16 1.23 56.81 59
కొత్తకోట 7,303 2.29 1.16 50.70 80
అచ్చంపేట 6,763 3.39 2.70 68.78 25
కొల్లాపూర్ 6,517 1.32 0.74 55.91 61
కోస్గి 6,445 2.11 1.66 55.17 65
ఆత్మకూర్ 5,322 2.26 1.00 44.34 102
పెబ్బేరు 5,284 1.20 0.86 71.92 15
వడ్డేపల్లి 4,116 1.07 0.81 75.70 09
భూత్పూర్ 3,671 3.65 1.77 48.44 84
అలంపూర్ 3,578 0.50 0.32 64.60 35
దేవరకద్ర 3,442 0.51 0.34 66.86 29
మద్దూర్ 3,177 0.49 0.36 72.86 12
అమరచింత 2,796 0.63 0.36 56.99 58
పురపాలికల వారీగా పన్ను వసూళ్లు ఇలా..


