ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో పన్ను వసూళ్లకు బిల్ కలెక్టర్లే దిక్కయ్యారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది సరిపడా లేకపోవడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రధాన మున్సిపాలిటీల్లో మినహా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలుస్తోంది. పన్నులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు.
వందశాతం లక్ష్యంగా..
ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట
●


