ఇటీవల ఇతర రాష్ట్రాల పోలీసులు ఇక్కడి వ్యాపారుల నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. బాధితులకు న్యాయం చేస్తూనే.. దొంగ బంగారమని తెలిసి కొనుగోలుచేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవు. పదే పదే దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లాలోని బంగారు వ్యాపారుల వివరాలు సేకరించి.. అక్రమ దందాకు పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకుంటాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల
●


