ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు

Mar 22 2026 1:47 AM | Updated on Mar 22 2026 1:47 AM

అయిజ: ఆర్డీఎస్‌ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు చేపట్టిన తుమ్మళ్ల ప్రాజెక్ట్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, దేశంలో రిజర్వాయర్‌ లేకుండానే లిఫ్ట్‌ నిర్మించిన ప్రాజెక్ట్‌గా తుమ్మిళ్ల నిలిచిపోయిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన అయిజలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో అలంపూర్‌ నియోజకవర్గంలో తుమ్మిళ్ల అనుసంధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పేరు ప్రస్తావనే లేదని మండిపడ్డారు. రిజర్వాయర్‌ నిర్మించనందుకు నదిలో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే లిఫ్ట్‌ ద్వారా సాగునీరు అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయని, పంట చివరిదశలో ఉన్నప్పుడు నదిలో నీళ్లు లేకుండాపోతే పంటలు ఎండిపోతాయని వాపోయారు. అదేవిధంగా జూరాల–పాకాల ప్రాజెక్ట్‌ లేకపోయినా.. గత 12 ఏళ్లుగా నిధులు విడుదల చేస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని శనివారం అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు.

తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌లో

రిజర్వాయర్‌ నిర్మించరా?

‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయండి

గద్వాల: ఐకేపీ వీఓఏల సమస్యల పరిష్కారం కోసం బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలోనే నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంలో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమంలో వీఓఏ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌, తిరుమలేష్‌, బీసమ్మ, వెంకట్రామయ్య, మునీశ్వరి, రాధమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement