రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
గద్వాలటౌన్: జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 76 ప్రారంభించామని, ఎక్కడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజోన్న, సోయా కొనుగోలు కేంద్రాలతో పాటు అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలు దెబ్బతినడం, ఇతర అంశాలపై సోమవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధింత అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈక్రమంలో కలెక్టర్ సంతోష్ కొనుగోలు కేంద్రాలలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులకు వివరించారు. త్వరలో మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామికుమార్, మేనేజర్ విమల, వ్యవసాయ అధికారి జగ్గునాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


