
రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
గద్వాల: ప్రధానమంత్రి ధన కృషి యోజన ద్వారా అన్నదాతలు ఆర్ధికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధాన్య కృషి యోజనలో జిల్లా ఎంపికకవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి జిల్లా కేంద్రంలోని అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్సరెన్స్ తిలకించి మాట్లాడారు. నేల సారవంతతను బట్టి రైతులు విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు ముందుండాలని వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్‌చార్జ్ డిఏఓ జగ్గు నాయక్, ఏడీఓ సంగీత లక్ష్మీ, తదితరులు ఉన్నారు.