
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆ దివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్‌చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ రోహిత్‌రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు.
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్