
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్‌లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్‌లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్‌లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.
ఉదండాపూర్‌లో జఠిలంగా పరిహారం..
పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం.
రిజర్వాయర్‌లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్
డెడ్‌లైన్.. డిసెంబర్
మిగతా పెండింగ్ ప్రాజెక్ట్‌ల పూర్తికి డెడ్‌లైన్..
కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్‌లోపు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు.
డిసెంబర్‌లో సాగు నీరందిస్తాం..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్‌లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం.
– విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్
4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం

శరవేగంగా పాలమూరు..!

శరవేగంగా పాలమూరు..!

శరవేగంగా పాలమూరు..!