
పవనపుత్రా.. పాహిమాం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, వడమాల, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిదంగా వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 1008 పర్యాయాలు హనుమాన్ చాలిసా పారాయణం చేశారు. హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారద దంపతులు గురువారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామన్‌గౌడ్ ఎమ్మెల్యే దంపతులను శేష వస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించారు. వారి వెంట నాయకులు విజయవర్దన్‌రెడ్డి, అక్కి శ్రీనివాస్‌గౌడ్, వెంకట్రాములు, సురేందర్‌గౌడ్, రంజిత్‌కుమార్, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.
బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంత్యుత్సవాలు

పవనపుత్రా.. పాహిమాం