
సాగుదాం..
జోగుళాంబ గద్వాల
వానాకాలం
పంటల సాగు ప్రణాళిక ఖరారు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
వివరాలు 8లో u
విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు
గడిచిన ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పంటల దిగుబడులు బాగా వచ్చాయి. రానున్న వానాకాలం సీజన్‌లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే పంటలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈసీజన్‌లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– సక్రియానాయక్, డీఏఓ
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈఏడాది వానాకాలం సీజన్ పంట ప్రణాళిక ఖరారు అయ్యింది. 3,67,211 ఎకరాల్లో పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గడిచిన ఏడాది వానాకాలం, యాసంగి సీజన్‌లు సాఫీగానే సాగయ్యాయి. ఈఏడాది కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్న ఆశతో అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు వ్యవసాయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
గడిచిన ఏడాది సాఫీగా సాగు
2024–25 వానాకాలం, యాసగి సీజన్‌లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచిన ఏడాది వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు దిగుబడులు బాగా వచ్చాయి. అయితే వానాకాలం సీజన్‌లో సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 2వేల ఎకరాల్లో పత్తి, ఆముదం, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక యాసంగిలోనూ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల వరి, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటల దిగుబడులు ఆశించిన మేర వచ్చాయి.
అత్యధికం పత్తి, వరి..
వానాకాలం సీజన్‌కు అవసరమైన పంట ప్రణాళికను ఇక్కడి వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయా ప్రాంతాలలో 3,21305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 45906 ఎకరాల్లో ఉద్యాన పంటలు, మొత్తం 3,67,211 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి,కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. ఇక కంది పంటకు సంబందించి గడిచిన ఏడాది దాదాపు 40వేల ఎకరాల్లో వేశారు. అంతకుముందు మూడేళ్లు తక్కువగా వేశారు. ఈ ఏడాది సాగు ఎక్కువగా ఉంటుంది. వేరుశనగ పంట అంచనాకు మించి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి 30వేల ఎకరాల్లో ఎండుమిర్చి, 3936 ఎకరాల్లో ఆయిల్‌పాంమ్, 11,665 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనాగా ఉంది. ఇదిలా ఉంటే పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల లెక్కలు సైతం అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 49వేల క్వింటాళ్ళ పత్తి, వరి, కంది తదితర పంటలకు విత్తనాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అన్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు అన్నదాతలు సిద్ధం అయ్యారు. గడిచిన పది రోజల వ్యవదిలో మూడునాలుగు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ రెండో, మూడో వారం నాటికి వర్షాలు ఆశించిన స్తాయిలో కురిస్తే చివరి వారంలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు.
న్యూస్‌రీల్
ఎరువులు ఇలా...
3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంట సాగవుతాయని అంచనా
పత్తి, వరి, కంది పంటలు అధికంగా సాగుచేసే అవకాశం
వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు

సాగుదాం..

సాగుదాం..

సాగుదాం..